వందే భారత్ రైల్లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడికి అందించిన భోజనంలో పురుగు కనిపించడం కలకలం రేపింది. ఈ ఘటనపై స్పందించిన ఐఆర్‌సీటీసీ సంబంధిత సరఫరాదారిపై రూ.10 లక్షల భారీ జరిమానా విధిస్తూ, కాంట్రాక్ట్ రద్దు నోటీసు జారీ చేసింది.
అహ్మదాబాద్ నుంచి ముంబైకి వెళ్తున్న వందే భారత్ రైల్లో ప్రయాణిస్తున్న ఓ ముంబై నివాసి తనకు అందించిన దాల్-చావల్ భోజనంలో పురుగు కనిపించిందని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ “X”లో వెల్లడించారు.అతని కోచ్‌లో కనీసం రెండు ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని, దీంతో ప్రయాణికులు భోజనం చేయడం ఆపేశారని తెలిపారు.
షేర్ చేసిన ఫోటోలు, వీడియోల్లో దాల్-చావల్ బాక్స్‌లో కాక్రోచ్‌లాంటి పురుగు కనిపించింది.ఈ భోజనాన్ని M/S బ్రందావన్ ఫుడ్ ప్రోడక్ట్స్ (RK గ్రూప్‌కు చెందిన సంస్థ) సరఫరా చేసినట్లు ప్రయాణికుడు పేర్కొన్నారు.FSSAI ప్రమాణాలకు అనుగుణంగా ఆహారం తయారు చేయడం లేదని అనుమానం వ్యక్తం చేస్తూ, సంబంధిత అధికారులను “రెయిడ్ చేయాలి” అని డిమాండ్ చేశారు.దోషిగా తేలితే లైసెన్స్ రద్దు చేయాలని కూడా కోరారు.
ఐఆర్‌సీటీసీ చర్యలు
ఈ ఘటనపై స్పందించిన ఐఆర్‌సీటీసీ:
రూ.10 లక్షల జరిమానా విధించింది
కాంట్రాక్ట్ రద్దు నోటీసు జారీ చేసింది
సంబంధిత కిచెన్‌ను సీజ్ చేసి, డీప్ క్లీనింగ్, పెస్ట్ కంట్రోల్ చర్యలు చేపట్టింది.
Also Read:‘గాయపడ్డ సింహం’లో జేడి!
ప్రయాణికులకు కలిగిన అసౌకర్యంపై మేము చింతిస్తున్నాం. ఈ విషయాన్ని అత్యంత గంభీరంగా తీసుకున్నాం. హైజీన్, భద్రత మా ప్రాధాన్యత అని ఐఆర్‌సీటీసీ తెలిపింది.ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు.ఇప్పుడే కాకుండా ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయి..ఇది ప్రజా ఆరోగ్య సమస్యగా మారుతోంది..ఇక నుంచి బయట ఆహారం తీసుకోను, ఇంటి నుంచే తీసుకెళ్తాను అని కామెంట్స్ చేస్తున్నారు.

