కవితకు శుభాకాంక్ష‌లు తెలిపిన‌ మ‌ంత్రి అల్లోల‌

330
indrakaran reddy
- Advertisement -

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత నామినేషన్‌ దాఖలు చేసిన మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఆమెకు శుభాకాంక్ష‌లు తెలిపారు. తెలంగాణ జాగృతి స్థాపించి తెలంగాణ ఉద్యమంలో కవిత కీలకపాత్ర పోషించారన్నారు.

తెలంగాణ ఉద్యమకారిణిగానే ఆమె 2014లో నిజామాబాద్‌ ఎంపీ టికెట్‌ సాధించి గెలిచారన్నారు. తెలంగాణ ప్ర‌త్యేక‌ ఉద్య‌మంలో క‌విత క్రీయ‌శీల పాత్ర పోషించార‌ని, ఎంపీగా గెలుపొంది నిజామాబాద్‌కు అనేక సేవలందించారన్నారు. ఎమ్మెల్సీగా కవిత గెలుపు లాంఛ‌న‌మే అని తెలిపారు.

మ‌రోవైపు టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యులుగా కే.కేశవరావు, కేఆర్‌.సురేష్‌ రెడ్డి ఇరువురి ఏకగ్రీవ ఎన్నిక పట్ల మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సంద‌ర్బంగా శుభాకాంక్ష‌లు తెలిపారు.

- Advertisement -