అడివి శేష్-అవసరాల శ్రీనివాస్‌ల మల్టీస్టారర్..

84
Indraganti

“జెంటిల్ మెన్”తో సూపర్ హిట్ అందుకొన్న తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి మరో డిఫరెంట్ జోనర్ లో సరికొత్త చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నద్ధమయ్యారు. స్క్రూ బాల్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో అడివి శేష్-అవసరాల శ్రీనివాస్ లు హీరోలుగా నటిస్తుండగా.. “ఎ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్” పతాకంపై కె.సి.నరసింహారావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

Gentleman

ఈ సందర్భంగా “ఎ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్” సంస్థ అధినేత కె.సి.నరసింహారావు మాట్లాడుతూ.. “అడివి శేష్-అవసరాల శ్రీనివాస్ లు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించనున్న చిత్రంతో నిర్మాతగా మారుతుండడం సంతోషంగా ఉంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ మా చిత్రానికి సంగీత సారధ్యం వహించనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది” అన్నారు.

ఈ చిత్రానికి కో-డైరెక్టర్: కోటా సురేష్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్: ఎస్.రవిందర్, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, సినిమాటోగ్రాఫర్: పి.జి.విందా, మ్యూజిక్: మణిశర్మ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వినయ్, ప్రొడ్యూసర్: కె.సి.నరసింహా రావు, రచన-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి!