- Advertisement -
ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. వారం రోజుల వ్యవధిలోనే రెండు సార్లు భూకంపం సంభవించడం ఇండోనేషియా ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.0 గా నమోదైంది. ఉత్తర తీరంలోని లాంబోక్ దీవిలో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడైంది. ఇండోనేషియాలో భూకంపం సంభవించడంతో ఆ దేశ విపత్తు నిర్వహణ అధికారులు సునామి హెచ్చరికలు జారీ చేశారు. గత వారం ఇండోనేషియాలో సంభవించిన భూకంపంలో 17 మంది మరణించారు. గత వారం సంభవించిన భూకంపం కంటే ఈ భూకంపం తీవ్రత ఎక్కువగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్క ఇండోనేషియాలోనే కాకుండా ఆ దేశం చుట్టు పక్కల దేశాల్లోనూ భూమి కంపించినట్టు వార్తలు వస్తున్నాయి.
- Advertisement -