- Advertisement -
తెలంగాణలో మరో కొత్త పథకం ప్రారంభంకానుంది. ఇవాళ భద్రాద్రి జిల్లాలోని కొత్తగూడెంలో ఇందిరమ్మ అమృతం పథకాన్ని ప్రారంభించనుంది మంత్రి సీతక్క. కౌమార బాలికల్లో రక్తహీనతను నివారించేందుకు ఇందిరమ్మ అమృతం తీసుకొచ్చారు.
ఆడపిల్లలకు శక్తినిద్దాం.. ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దాం అన్న నినాదంతో సరికొత్త పథకం ప్రారంభంకానుంది. 14 నుంచి 18 ఏళ్ల వయసుగల అమ్మాయిలకి అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రతి రోజు ఒక చిక్కి ఇవ్వనున్నారు.
పల్లీ పట్టీ , చిరు ధాన్యాల పట్టీలను అందచేయనుంది ప్రభుత్వం. పైలట్ ప్రాజెక్టు కింద భద్రాద్రి కొత్తగూడెం, కుమ్రం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అమలు చేయనున్నారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమలు చేయనున్నారు.
Also Read:GIC:హరితసేనలో నటి మధుమిత
- Advertisement -

