TG:ఇందిర సౌర గిరి జల వికాస పథకం

8
- Advertisement -

నేడు స్వగ్రామం కొండారెడ్డిపల్లెకు వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అభివృద్ధి పనుల్లో భాగంగా నేడు నాగర్‌కర్నూల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు.అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం.

రూ. 12,600 కోట్ల బడ్జెట్‌తో ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకం ప్రారంభంకానుంది. ఒక్కో యూనిట్‌కు రూ.6 లక్షల చొప్పున వంద శాతం సబ్సిడీతో లబ్ధిదారులకు అందించనుంది ప్రభుత్వం.

పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు సోలార్ పంపుసెట్లను పంపిణీ చేయనున్నారు సీఎం. అనంతరం సీతారామాంజనేయ ఆలయాన్ని దర్శించుకుని బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు సీఎం.

Also Read:ఆర్మీ..బీటెక్ విద్యార్థులకు గుడ్‌ న్యూస్

- Advertisement -