జయ ప్రసంగానికి ఇందిరా ఫిదా…

192
Indira came to Rajya Sabha to hear Jayalalithaa’s speech
- Advertisement -

జయలలిత… ఇటు రాజకీయ జీవితానికి, అటు సినీ జీవితానికి సంబంధించి అందరకి తెలియని ఆసక్తికరమైన అంశాలు ఎన్నో ఉన్నాయి. సీఎంగా జయలలిత ఇంటర్వ్యూలు ఇచ్చిన సందర్భాలు కూడా తక్కువే. కానీ జయలలిత తెలుగు,తమిళం,హిందీ,ఇంగ్లీషులో మాట్లాడటంలో దిట్ట. ఆమె ఎక్కువగా ఇంగ్లీషు నవలలు ఎక్కువ చదివేవారు. ఎక్కడికి షూటింగ్‌కు వెళ్లినా చేతిలో పుస్తకం ఉండాల్సిందే. రాజకీయాల్లోకి వచ్చాక కూడా ఆమె ఇంగ్లీషు నవలలను వదల్లేదు.

ఇక జయలలిత తమిళ భాషలో బాగా రాస్తారని పేరుంది. థాయ్‌ పేరుతో తమిళ పత్రికలు వ్యాసాలు రాసేవారు. ఓ నవల కూడా రాశారట. అందుకే జయలలిత ప్రసంగానికి అందరు ఫిదా అయిపోయేవారట. ఏకంగా ఇందిరా గాందీనే జయ ప్రసంగం వినడానికి వచ్చిందంటే ఆమె వాగ్దాటి ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు.

జయలలిత మృతికి పార‍్లమెంట్‌ ఉభయ సభలు సంతాపం ప్రకటించిన అనంతరం 1984లో రాజ్యసభ సభ్యురాలుగా ఉన్న జయలలిత జ్ఞాపకాలను డిప్యూటీ చైర్మన్‌ పీజే కురియన్‌ గుర్తుచేసుకున్నారు. ఆ ఏడాది రాజ‍్యసభలో జయలలిత ప్రసంగించారని చెప్పారు. జయలలిత ప్రసంగం వినడం కోసం నాటి ప్రధాని ఇందిరా గాంధీ రాజ్యసభకు వచ్చారని కురియన్‌ వెల్లడించారు. రాజ్యసభలో జయలలిత ప్రసంగించడం అదే తొలిసారని పేర్కొన్నారు. ఆ సమయంలో తాను లోక్‌సభ సభ్యుడిగా ఉన్నానని చెప్పారు.

‘జయలలిత ప్రసంగించినపుడు గ్యాలరీ పూర్తిగా నిండిపోయింది. ఆమె ప్రసంగానికి సభికులు ముగ్ధులయ్యారు. అందరూ ఆమెను అభినందించారు. ఆ రోజు ఆదో పెద్ద వార్త అయ్యింది. సినీ పరిశ్రమ నుంచి వచ్చిన జయలలిత అంత అద్భుతంగా మాట్లాడుతారని ఎవరూ ఊహించలేకపోయారు. ప్రజల హృదయాల్లో జీవించిన నాయకురాలు ఆమె. పేద ప్రజల కోసం, మహిళా సాధికారత కోసం ఎనలేని కృషి చేశారు’ అని కురియన్‌ అన్నారు.

- Advertisement -