- Advertisement -
రాష్ట్రాలకు ఇప్పటివకు 22,77,62,450 వ్యాక్సిన్ మోతాదులను సరఫరా చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది. వృథాతో సహా 20,80,09,397 వయల్స్ని వినియోగించినట్లు తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రాల వద్ద 1.82 కోట్లకుపైగా మోతాదులు రాష్ట్రాలు, యూటీల వద్ద అందుబాటులో ఉన్నాయని చెప్పింది.
దేశవ్యాప్తంగా ప్రతిరోజూ 20 లక్షలకు పైగా శాంపిళ్లను పరీక్షిస్తున్నారు. శుక్రవారం కూడా కొత్తగా 20,80,048 మంది నుంచి శాంపిళ్లను సేకరించి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. దాంతో దేశంలో ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 34 కోట్ల మార్కును దాటి.. 34,11,19,909కి చేరింది.
- Advertisement -