అమెరికా నుండి భారత్‌కు చెందిన అక్రమ వలసదారులను వెనక్కి పంపే ప్రక్రియ కొనసాగుతోంది. 119 మందితో కూడిన రెండో విమానం అమృత్‌సర్‌లో ల్యాండ్ అయింది.
అధ్యక్షుడు ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 100 మందికి పైగా భారతీయులను అమెరికా నుండి వెనక్కి పంపడం ఇది రెండోసారి. వెనక్కి పంపిన ఈ 119 మందిలో 100 మంది పంజాబ్, హర్యానాకు చెందినవారు. వీరిలో పంజాబ్ నుంచి 67 మంది, హర్యానా నుంచి 33 మంది, గుజరాత్ నుంచి 8 మంది, ఉత్తరప్రదేశ్ నుంచి ముగ్గురు, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి ఇద్దరు చొప్పున, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు.
మూడో విమానం ఆదివారం భారత్‌కు చేరుకుంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ విమానంలో 157 మంది భారతీయులు ఉంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి.అంతకుముందు, ఫిబ్రవరి 5న, ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం జరిగిన కొద్ది రోజుల తర్వాత, 104 మంది అక్రమ వలసదారులతో ఒక అమెరికన్ సైనిక విమానం అమృత్‌సర్ చేరుకుంది.
Also Read:కేసీఆర్ బర్త్ డే..సేవా కార్యక్రమాలకు పిలుపు