ఐపిఎల్ 11వ సీజన్ లో తన బౌలింగ్ , బ్యాటింగ్ తో అద్బుతమైన ప్రదర్శనను కనబరుస్తున్నాడు ఆల్ రౌండర్ రషీద్ ఖాన్. తన ఆటతో ప్రేక్షకుల మనసు దొచుకుంటున్నాడు రషీద్. సన్ రైజర్ టీంను విజయ వైపు తీసుకెళ్తున్నాడు. నిన్న రాత్రి కోల్ కత్తాతో జరిగిన మ్యాచ్ లో రషీద్ కీలకంగా వ్యవహరించాడు. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ లో ప్రత్యర్దులకు ముచ్చెమటలు పట్టించాడు. కేవలం 10 బాల్లలోనే 34పరుగులు చేసి హైదరాబాద్ అభిమానులకు దేవుడిగా నిలిచాడు. బౌలింగ్ లో కూడా తనదైన ప్రదర్శనను కనబర్చాడు. కేవలం 19 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అంతే కాకుండా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ను సోంతం చేసుకున్నాడు.
నిన్న జరిగిన మ్యాచ్ పై రషీద్ ఖాన్ కు సోషల్ మీడియాలో పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం రషీద్ పేరు సోషల్ మీడియాలో హల్ చల్ అవుతుంది. క్రికెట్ అభిమానులు రషిద్ పోగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈసందర్భంగా రషిద్ ను పోగుడుతూ..జడేజాను విమర్శిస్తూ పలువురు నెటిజన్లు ట్వీట్టర్ లో కామెంట్లు చేస్తున్నారు. అఫ్గాన్ క్రికెట్ బోర్డుతో బీసీసీఐ ఓ ఒప్పందం చేసుకోవాలి. ఆ ఒప్పందం ప్రకారం రవీంద్ర జడేజాను ఆఫ్గానిస్తాన్ కు ఇచ్చేసి..రషీద్ ను ఇండియా తరపున ఆడించాలి అని కొందరు నెటిజన్లు ట్వీట్ చేశారు. మరికొందరు ఈ ట్వీట్ ను ఏకంగా కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ కు చేశారు. ఈట్వీట్ల పై సుష్మ స్వరాజ్ కూడా స్సందించింది. మీరందరూ చేస్తున్న ట్వీట్లు చూస్తున్నాను . ఆవిషయాన్ని కేంద్ర హోం శాఖ చూసుకుంటుందని ట్వీట్ చేశారు.
ఇక రషీద్ ఖాన్ పై పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. నిన్న మ్యాచ్ ను చూసిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు రషీద్ ఖాన్ ను పొగిడాడు. ఆ ట్వీట్ కు రషీద్ కూడా రీ ట్వీట్ చేశారు. రషీద్ ఖాన్ ఆట తీరుపై క్రికెట్ దేవుడు సచిన్ టెండూట్కర్ కూడా ప్రశంసల వర్షం కురిపించాడు. రషీద్ ఆట తీరు అద్బుతం అన్నారు. టీ-20 ఫార్మాట్‌లో ప్రపంచంలోనే రషీద్ ఉత్తమ స్పిన్నర్ అని సచిన్ కొనియాడాడు. ఇక రషీద్ ను పొగుడుతూ..జడేజాను విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలపై జడేజా ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.