అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. భారతదేశాన్ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీస్తున్నాయి. “భారతీయులు చాలా మంచి నటులు” అని వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తగ్గించాలని అమెరికా సహా పశ్చిమ దేశాలు పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో భారత్ రష్యా చమురును కొనవద్దని కూడా అమెరికా సూచించింది.
ఈ నేపథ్యంలో స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “భారతీయులు చాలా తెలివైనవారు. మేము చెప్పగానే రష్యా చమురు కొనుగోళ్లను తగ్గించి అమెరికా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తామని చెప్పారు. అయితే ఇప్పుడు ప్రపంచ మార్కెట్‌లో చమురు కొరత రాకుండా ఉండేందుకు సముద్రంలో ఇప్పటికే సిద్ధంగా ఉన్న రష్యా చమురును కొనుగోలు చేయాలని మేమే భారత్‌ను కోరాం” అని అన్నారు.
Also Read:ఊబకాయంతో క్యాన్సర్ ముప్పు?
అమెరికా తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని కూడా ఆయన పేర్కొన్నారు. ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థలో సమతుల్యతను కాపాడుకోవడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.స్కాట్ బెసెంట్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు ఆయన వ్యాఖ్యలను భారత్‌ను తక్కువ చేసి మాట్లాడినట్లుగా విమర్శిస్తుండగా, మరికొందరు ఇది వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్య మాత్రమేనని అంటున్నారు.

