కెన‌డా వీసాల‌ను నిలిపివేసిన భార‌త్‌..

29
- Advertisement -

భారత్ – కెనడా మధ్య ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కెనడా వీసాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఖ‌లిస్తానీ ఉగ్ర‌వాది హ‌ర్దీప్ సింగ్ నిజ్జ‌ర్ హ‌త్య వెనుక భార‌త్ ప్ర‌మేయం ఉంద‌ని కెన‌డా ఆరోపించగా దీనిపై సమగ్ర విచారణ జరగాలని అమెరికా కూడా వెల్లడించింది.

దీంతో నేటి నుండి సెప్టెంబ‌ర్ 21 నుంచి భార‌తీయ వీసా సేవ‌లు త‌దుప‌రి నోటీసులు వెలువడే వ‌ర‌కూ నిలిచిపోయాయ‌ని తెలిపారు. దీంతో పాటు భార‌త్‌, కెన‌డా మ‌ధ్య సంబంధాలు దెబ్బ‌తిన‌డంతో కెన‌డాలో భార‌తీయులు అత్యంత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని త‌మ పౌరుల‌కు భార‌త్ మార్గ‌దర్శ‌కాల‌కు జారీ చేసింది. కెనడాలో భారత వ్యతిరేక కార్యకలాపాలు, రాజకీయ ప్రేరేపిత, ద్వేషపూరిత నేరాలు, హింస పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. భారత వ్యతిరేక ఎజెండాను వ్యతిరేకించే భారత పౌరులకు బెదిరింపులు వస్తున్నాయని తెలిపింది.

కెనడాలోని భారత పౌరులు, విద్యార్థులు, ఆ దేశానికి వెళ్లాలనుకునే భారతీయులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

Also Read:మీ ఫోన్‌కు ఎమర్జెన్సీ అలర్ట్..వచ్చిందా!

- Advertisement -