ఇలా జడ వేయడం బొమ్మల్లోనే చూస్తామేమో..!

975
rendujadalu
- Advertisement -

ఆధునికత మనిషి జీవన విధానాన్నే మార్చేస్తోంది. మారుతున్న సమాజ జీవనానికి అనుగుణంగా మనిషిలో మార్పు రావడం..లేనిదానికోసం పరుగులు పెడుతుండటంతో అన్ని ఇన్‌స్టాంట్‌గా దొరికే పరిస్ధితి నెలకొంది.ఒకరకంగా చెప్పాలంటే మనిషే ఓ ఇన్‌స్టాంట్ వస్తువుగా మారిపోయాడు.అందుకే మన ఇళ్లల్లో ఎవరైనా పెద్దవారుంటే మా జమానాలో ఇలా ఉండేదే కాదని వారి జ్ఞపకాలను గుర్తుచేస్తుంటారు. వారు చెప్పినప్పుడు ఎంతోముచ్చటపడే మనం దానిని ఆచరించడంలో మాత్రం సిగ్గుపడుతున్నాం.

గతంలో ఏ పల్లెలను చూసిన ,ఏ వాడకట్టుకెళ్లినా అంతా కలిసిమెలిసి ఉండేవారు. కులం,మతంతో సంబంధం లేకుండా ఒకరితోఒకరు కలిసిపోయేవారు. పొరుగువారికి సాయపడటంలో ముందుండేవారు.కానీ ప్రస్తుతం సీన్ కట్ చేస్తే ఇప్పుడు అలాంటి పరిస్ధితులు కనిపించడం లేదు.

ఉదహరణకు రెండు జడలతో బడికి వెళ్లిన రోజులు,ఒకరి జడను మరొకరూ వేస్తూ ఉండే రోజులు ఎంతమందికి గుర్తున్నాయి..?చక్కగా నూనె పెట్టి జడ అల్లి రిబ్బన్‌తో ముడివేస్తే మరుసటి రోజు వరకు అలానే జడలు చెక్కుచెదరకుండా ఉండేవి.

కానీ ప్రస్తుతం మారిన ట్రెండ్‌,బ్యూటిపార్లర్‌ల రాకతో రకరకాల హెయిర్‌స్టైల్‌లు అందుబాటులోకి రావడంతో అలా రెండు జడలను చూసే భాగ్యం ఇలా బొమ్మల్లోనే చూడాల్సిన పరిస్థితి వస్తుందేమో. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునికతను అందిపుచ్చుకోవడంలో తప్పులేదు కానీ ఆ పేరుతో మన సంస్కృతి,సంప్రదాయాలను ఎంతవరకు పాటిస్తున్నాం అనేది కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడింది.

- Advertisement -