కరోనా రూపం ఇదే…: భారతీయ శాస్త్రవేత్తలు

273
covid 19
- Advertisement -

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి 199కి పైగా దేశాలకు విస్తరించిన సంగతి తెలిసిందే. రోజురోజు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటం అందరిని ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ తయారు చేయడంలో ప్రపంచదేశాలు నిమగ్నమయ్యాయి.

ఈ నేపథ్యంలో కరోనా వైరస్ కు సంబంధించిన ఫోటోలను తొలిసారి బంధించారు భార‌తీయ శాస్త్ర‌వేత్త‌లు. క‌రోనా వైర‌స్‌కు సంబంధించిన మైక్రోస్కోప్ చిత్రాల‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రాలను దేశంలో తొలి కేసుగా నమోదైన వ్యక్తి నుంచి సేకరించిన శ్యాంపిల్‌ లో వైరస్ ని గుర్తించారు.

SARS-CoV-2 వైర‌స్‌కు సంబంధించిన ఫోటోల‌ను ఇండియ‌న్ జ‌ర్న‌ల్ ఆఫ్ మెడిక‌ల్ రీస‌ర్చ్‌లో ప్ర‌చురించారు. ఆ శ్యాంపిళ్ల‌ను మైక్రోస్కోప్‌లో ప‌రీక్షించిన శాస్త్ర‌వేత్త‌లు…. కోవిడ్‌19 వ్యాధికి సంబంధించిన వైర‌స్‌ను కనిపెట్టారు.

- Advertisement -