భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తత్కాల్ రైల్వే టికెట్ బుకింగ్ సమయంలో ఈ ఆధార్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది కచ్చితమైన రైల్వే ప్రయాణికుడిని గుర్తించేందుకు ఉపయోగపడుతుందని ప్రకటించింది. త్వరలో ఇది అమల్లోకి రానుందని తెలిపారు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్.
త్వరలోనే ఈ-ఆధార్ ఆధారంగా తాత్కాల్ టికెట్లు పొందే ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అవసరమైన సమయంలో నిజమైన యూజర్లకు కన్ఫర్మ్ టికెట్లు దక్కాలన్న ఉద్దేశంతో ఈ-ఆధార్‌ను తాత్కాల్ టికెట్లకు తప్పనిసరి చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. మే 22వ తేదీన ఒక నిమిషంలో అత్యధిక సంఖ్యలో టికెట్లు బుక్ అయ్యాయని, ఆ రోజున కేవలం 60 సెకన్లలో 31,814 టికెట్లు బుక్ అయినట్లు రైల్వే శాఖ చెప్పింది. ఆపరేషనల్ సామర్థ్యంలో ఇదో కొత్త మైలురాయిని రైల్వే శాఖ తెలిపింది.
ఆధార్ వెరిఫికేషన్ లేని యూజర్లు.. రిజిస్ట్రేషన్ తర్వాత మూడు రోజులకు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇక ఈ-ఆధార్ వెరిఫై యూజర్ ఎటువంటి జాప్యం లేకుండా టికెట్‌ను పొందవచ్చు అని రైల్వే శాఖ చెప్పింది.
Also Read:అనుష్క పోస్టర్‌తో 40కి పైగా ప్రమాదాలు

