భారత జట్టుకు బయోబబుల్ నుంచి 20 రోజుల బ్రేక్‌..

261
Team India
- Advertisement -

కరోనా టైంలో భారత జట్టుకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కరోనా వెలుగుచూసినప్పటి నుంచి ప్రతి సిరీస్‌కు ముందు క్వారంటైన్, బయోబబుల్‌లో గడుపుతున్న ఆటగాళ్లకు ఈసారి కాస్తంత రిలీఫ్ లభించనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ముగిసిన తర్వాత మూడు వారాల పాటు ఆటగాళ్లకు బయోబబుల్ నుంచి బ్రేక్ ఇవ్వనున్నట్టు టీమిండియా మేనేజ్‌మెంట్ ప్రకటించింది. డబ్ల్యూటీసీ ఫైనల్ ఈ నెల 18-22 మధ్య సౌతాంప్టన్‌లో జరగనుంది. అది ముగిసిన వెంటనే ఆటగాళ్లకు 20 రోజులపాటు స్వేచ్ఛ ఇవ్వనున్నారు. ఈ కాలంలో వారు యూకేలో ఎక్కడికైనా స్వేచ్ఛగా వెళ్లి రావొచ్చు. అయితే, కొవిడ్ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.

ఇది ఎంతో ఊర‌ట క‌లిగించే విష‌య‌మ‌ని టీమ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. నిజానికి ఇంగ్లండ్‌తో రెండు నెల‌ల పాటు జ‌రిగే టెస్ట్ సిరీస్ ముగియ‌గానే ప్లేయ‌ర్సంతా మ‌ళ్లీ ఐపీఎల్ బ‌బుల్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేప‌థ్యంలో ఈ 20 రోజులు వాళ్ల‌కు స్వేచ్ఛ‌గా తిరిగే అవకాశం రావ‌డం మాన‌సికంగా ఉల్లాసానికి గురి చేసేదే. ఆగ‌స్ట్ 4న ఇంగ్లండ్‌తో టీమిండియా తొలి టెస్ట్ ఆడాల్సి ఉంది. అంటే ఫైన‌ల్ ముగిసిన త‌ర్వాత సుమారు 40 రోజుల స‌మ‌యం ఉంది. అందులో 20 రోజులు ప్లేయ‌ర్స్‌ను స్వేచ్ఛ‌గా వ‌దిలేయ‌నుండ‌గా.. జులై 14 నుంచి మ‌ళ్లీ బ‌బుల్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది.

- Advertisement -