బైడెన్‌ను చంపాలనుకున్నా..!

19
- Advertisement -

2023లో వైట్ హౌస్‌పై దాడి కేసులో తప్పును ఒప్పుకున్నారు తెలుగు కుర్రాడు సాయి వర్షిత్ కందుల. వైట్‌హౌస్‌ పరిసరాల్లోకి ట్రక్కుతో దూసుకొచ్చి దాడి చేసిన కేసులో తప్పును ఒప్పుకున్నారు. తన లక్ష్యం కోసం వీలైతే అధ్యక్షుడు బైడెన్‌ను చంపాలనుకున్నానని కోర్టు విచారణలో వెల్లడించారు.

వైట్‌హౌస్‌ భవనంలోకి వెళ్లి అధికారాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఈ దాడి చేశానని నిందితుడు విచారణలో తెలిపారు. తన లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో వీలైతే అధ్యక్షుడు బైడెన్‌ సహా ఇతరులను కూడా చంపాలని ముందుగానే ప్లాన్‌ చేసుకున్నట్టు వెల్లడించారు. ఈ ఘటనకు పాల్పడినట్టు విచారణలో రుజువైందని యుఎస్‌ అటార్నీ తెలిపింది.

అమెరికాలో శాశ్వత నివాసం పొందిన భారత సంతతి కుటుంబానికి చెందిన సాయి వర్షిత్‌ మిస్సోరీలోని సెయింట్‌ లూయిస్‌లో నివసించేవారు. గతేడాది మే 22న వాషింగ్టన్‌కు వెళ్లిన సాయి వర్షిత్‌.. అక్కడ ట్రక్కును అద్దెకు తీసుకున్నాడు. రాత్రి 9.35 గంటల ప్రాంతంలో వైట్‌హౌస్‌ వద్దకు చేరుకొని అక్కడ భద్రత నిమిత్తం ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను వాహనంతో ఢీకొట్టాడు. ఆ తర్వాత ట్రక్కు దిగి నాజీ జెండాను పట్టుకొని నినాదాలు చేస్తున్న అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక ఈ కేసులో సాయి వర్షిత్‌కు శిక్షను యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టు జడ్జి ఆగస్టు 23వ తేదీకి వాయిదా వేశారు.

Also Read:ఆకలి వేయట్లేదా.. ఇలా చేయండి!

- Advertisement -