అలనాటి సీనియర్ నటి జమున అనారోగ్యంతో కన్నుమూసిన తెలిసిందే. ఉదయం 11గంటలకు ఫిలిం ఛాంబర్ కు జమున భౌతికకాయం తరలించనున్నారు. జమున గారు 1953లో పుట్టిల్లు సినిమాతో తెరంగేట్రం చేసింది. 1955లో మిస్సమ్మ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె చేసిన పాత్రలలో సత్యభామ పాత్ర ప్రేక్షకుల మనసులో నిలిచిపోయింది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ సినిమాల్లో నటించింది. ఇప్పటివరకు ఆమె దాదాపు 150కి పైగా సినిమాల్లో నటించారు.
జమున 1936 ఆగస్టు 30 తేదీన హంపిలో జన్మించారు. తల్లిదండ్రులు నిప్పుని శ్రీనివాసరావు, కౌసల్యా దేవి. జమున తండ్రి ఒక వ్యాపార వేత్త. జమున బాల్యం అంతా గుంటూరు జిల్లా దుగ్గిరాలలో గడిచింది. జమున అసలు పేరు జనాబాయి. జన్మ నక్షత్రం రీత్యా ఆమె పేరులో ఏదైనా నది పేరు ఉండాలని చెప్పడంతో జమునగా మార్చారు. ఉత్తరాది వారంతా యమునా నదిని జమునా నదిగా పిలవటంతో ఆమెకు ఆ పేరు పెట్టారు.
జమున గారికి ఇందిరాగాంధీ అంటే ఎంతో అభిమానం. ఆ ఇష్టంతోనే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1989లోరాజమండ్రి లోక్ సభ నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. 1991లోనూ అదే నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత కొంతకాలం అదే పార్టీలో కొనసాగారు. కొన్నేళ్ల తర్వాత BJPలో చేరారు. అలా సినిమాలతో పాటు ప్రజా జీవితంలోనూ తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు జమున.
జమున స్వంతం చేసుకున్న అవార్డులు ఇవే
1968: ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు – మిలన్
1972: ఫిల్మ్‌ఫేర్ ప్రత్యేక అవార్డు – సౌత్- పండంటి కాపురం
1999: తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర గౌరవ పురస్కారం – MGR అవార్డు
2008: ఎన్టీఆర్ జాతీయ అవార్డు
2010: పద్మభూషణ్ డా. బి. సరోజాదేవి జాతీయ అవార్డు
2019: 17వ సంతోషం ఫిల్మ్ అవార్డ్స్‌లో సంతోషం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు
ఇవి కూడా చదవండి..