ఇంట్లోకి వచ్చి 23 గుడ్లు పెట్టిన కోబ్రా.. వీడియో వైరల్…

257
- Advertisement -

అడవిని వదిలి ఇంట్లోకి వచ్చింది. వచ్చి ఏకంగా ఆ ఇంట్లోనే గుడ్లు పెట్టింది. ఈ సంఘటన ఒడిశాలోని భువనేశ్వర్ లో చోటుచేసుకుంది. అయితే ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాములలో ఇండియన్ కోబ్రా ఒకటి. అలాంటి పాము ఇంట్లోకి వెళ్లి గుడ్లు పెట్టింది. స్థానికంగా ఉండే పాములు పట్టే వ్యక్తి ఈ కోబ్రాను అడవిలో వదిలే ప్రయత్నం చేయసాడు.. కానీ అప్పటికే ఆ పాము ఇంట్లో మూడు గుడ్లు పెట్టడం గమనించాడు.

ఈ విషయాన్ని ఒడిశా స్నేక్ హెల్ప్ లైన్ కు ఫోన్ చేశాడు. వాళ్లు ఆ పామును తమ దగ్గరికి తీసుకురావాల్సిందిగా కోరారు. తీసుకువెళ్లగా… ఆ కోబ్రా మిగతా గుడ్లు పెట్టేలా ఏర్పాట్లు చేశారు. ఆ పాము ఏకంగా 23 గుడ్లు పెట్టింది. పాము గుడ్లు పెడుతున్న సమయంలో వీడియో కూడా తీసారు. సాధారణంగా పాములు గుడ్లు పెట్టే సమయంలో చూడడటం అరుదుగా జరుగుతుందన్నారు స్నేక్ హెల్స్ లైన్ జనరల్ సెక్రటరీ సుభేందు మాలిక్. గుడ్లు పెట్టిన అనంతరం పామును అడవిలో
వదిలేశామని చెప్పారు.

ఆ గుడ్లను కృత్రిమంగా పొదగడానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు. 60 రోజుల తర్వాత బయటకు వచ్చే ఆ పాము పిల్లలను అడువుల్లో వదిలేయనున్నామన్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీరు పాము గుడ్లు పెట్టడం చూసారో.. లేదో.. చూడండి మరీ.

- Advertisement -