ఇవాళ ఇంగ్లాండ్‌తో భారత్ మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే టీమిండియా రెండు టీ20ల్లో విజయం సాధించింది. ఇక ఇవాళ జరిగే మూడో టీ20లోనూ గెలుపొంది సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది.
ఇక రాజ్ కోట్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ ద్వారా ఆర్ష్‌దీప్ సింగ్ అరుదైన రికార్డుకి చేరువలో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ రెండు వికెట్లు తీస్తే పురుషుల టీ20 క్రికెట్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన పేసర్‌గా రికార్డులకు ఎక్కనున్నాడు.
ప్రస్తుతం ఈ రికార్డు పాకిస్థాన్ పేసర్ హరీస్ రవూఫ్ పేరిట ఉంది. హరీస్ 71 టీ20 మ్యాచుల్లో 100 వికెట్లు తీశాడు. అర్ష్‌దీప్ సింగ్ ఇప్పటి వరకు 62 టీ20 మ్యాచులు ఆడి 98 వికెట్లు సాధించాడు. మొత్తంగా ఈ సిరీస్‌లో రెండు వికెట్లు తీస్తే అతి తక్కువ మ్యాచ్‌ల్లో 100 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలవనున్నాడు అర్షదీప్. ఆఫ్ఘాన్ బౌలర్ రషీద్ ఖాన్ కేవలం 54 మ్యాచుల్లోనే ఈ ఘనత సాధించాడు.
Also Read:తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్..