ఇంటర్‌తో ఆర్మీలో చేరండి..

299
Online News Portal
Indian Army Recruitment
- Advertisement -

ఇంటర్‌ విద్యార్హతతో ఉద్యోగం పొందాలనుకునే వారికి ఇండియన్‌ ఆర్మీ మంచి అవకాశాలను కల్పిస్తోంది. ఎంపీసీలో 70 శాతం మార్కులు ఉండాలి… నాలుగేండ్ల శిక్షణ, ఇంజినీరింగ్ డిగ్రీ, ఉద్యోగం… మంచి జీతభత్యాలు, పదోన్నతులు, సౌకర్యాలు…ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్‌ల ద్వారా ఎంపిక
భారత సైన్యం పర్మినెంట్ కమిషన్ కింద 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీం కోర్సు -37 నోటిఫికేషన్ విడుదల చేసింది.

వివరాలు:
అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
-మొత్తం ఖాళీల సంఖ్య – 90
-కోర్సు పేరు: 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీం కోర్సు – 37
-విద్యార్హతలు: ఇంటర్ లేదా 10+2 లేదా తత్సమాన కోర్సులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ల్లో కనీసం 70 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-వయస్సు: 16 1/2 – 19 1/2 ఏండ్ల మధ్య ఉండాలి. అంటే 1998, జనవరి 1 నుంచి 2001, జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి.
-కమిషన్ రకం: నాలుగేండ్ల కోర్సు పూర్తయిన తర్వాత అభ్యర్థులను పర్మినెంట్ కమిషన్ కింద ఆర్మీలో లెఫ్టినెంట్ హో దాలో ఉద్యోగ అవవకాశం కల్పిస్తారు.

indian-army

-శిక్షణ వివరాలు: మొత్తం శిక్షణా కాలం ఐదేండ్లు.
-బేసిక్ మిలిటరీ ట్రెయినింగ్ – ఏడాది (గయలోని ఆఫీసర్ ట్రెయినింగ్ అకాడమీలో)
-టెక్నికల్ ట్రెయినింగ్ – ఫేజ్ -1 (ప్రీ కమిషన్ ట్రెయినింగ్) – మూడేండ్ల శిక్షణ (పుణెలోని సీఎంఈ లేదా మెహలోని ఎంసీటీఈలో లేదా సికింద్రాబాద్‌లోని ఎంసీఈఎంఈలో శిక్షణను నిర్వహిస్తారు)

-ఫేజ్ -2లో (పోస్ట్ కమిషన్ ట్రెయినింగ్) – ఏడాదిపాటు శిక్షణ ఉంటుంది. దీన్ని కూడా పై మూడు కేంద్రాల్లో ఎక్కడో ఒకచోట నిర్వహిస్తారు.
-డిగ్రీ ప్రదానం: పైన పేర్కొన్న శిక్షణ పూర్తయిన అభ్యర్థులకు ఇంజినీరింగ్ డిగ్రీని ప్రదానం చేస్తారు.
-నోట్ : శిక్షణా కాలంలో పుస్తకాలు, ఇతర మెటీరియల్, వసతి, భోజన సౌకర్యాలను ఆర్మీ పూర్తిగా ఉచితంగా అందిస్తుంది.
-ఎంపిక విధానం: దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులను అకడమిక్ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం ఎస్‌ఎస్‌బీ భోపాల్, బెంగళూరు, అలహాబాద్‌ల్లో ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంది.

-ఈ ఇంటర్వ్యూలు ఐదురోజుల పాటు ఉంటాయి. స్టేజ్-1లో సైకలాజికల్, గ్రూప్ టెస్ట్‌లు, ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. దీనిలో క్వాలిఫై అయినవారిని తర్వాత స్టేజ్‌లోకి అనుమతిస్తారు.
-మెడికల్, ఇతర టెస్ట్‌లను నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
-సీటీసీ: లెఫ్టినెంట్ హోదాలో నెలకు రూ. 65,000 (సుమారుగా) వస్తాయి. వీటికి అదనంగా ఉచిత వైద్య సౌకర్యం (అభ్యర్థికి, కుటుంబ సభ్యులకు), క్యాంటీన్ సౌకర్యం, రేషన్, క్లబ్, స్పోర్ట్స్ తదితర సౌకర్యాలను ఆర్మీ కల్పిస్తుంది.
-పదోన్నతులు: లెఫ్టినెంట్ హోదా నుంచి కల్నల్ హోదా వరకు ప్రమోషన్ అవకాశాలు ఉంటాయి.
-శారీరక ప్రమాణాలు: కనీసం 152 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.
-నోట్: భవిష్యత్‌లో ఎత్తు పెరిగే అవకాశం ఉందని భావించి మెడికల్ బోర్డు అనుమతిస్తే ఎత్తులో 2.5 సెం.మీ వరకు మినహాయింపు ఇస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో 2016, నవంబర్ 8 నుంచి డిసెంబర్ 7 వరకు.
-వెబ్‌సైట్: www.joinindianarmy.nic.in

- Advertisement -