కశ్మీర్‌లోని యూరిలో పాక్ నుంచి చొరబడిన ఉగ్రవాదులు భారత సైనికులను పొట్టనబెట్టుకున్న ఘటన తర్వాత… పాక్‌పై ప్రతీకారంతో రగిలిపోతున్న సైనికుల్లో ఒకరు భావోద్వేగంతో చెప్పిన కవిత్వం అందరీని ఆకట్టుకుంటోంది. సింహం ఎవరికీ భయపడదు అంటూ భారత సైనికుడు పాడిన కవిత్వం.. భారతీయుల రక్తం మరిగిస్తోంది.
‘మేం సింహాలం. సింహాల పిల్లలం. సింహాలు ఎవరికీ భయపడవు. వెళ్లి పాకిస్థాన్‌కు చెప్పండి.. మేం బాంబు పేలుళ్లు, కాల్పులకు భయపడం. తాష్కెంట్, సిమ్లా ఒప్పందాలంటేనే మాకు భయం’ అని అందులో పేర్కొన్నారు. ‘అణుబాంబులు తయారుచేసుకొని మీరు విర్రవీగుతుండొచ్చు. 1965, 1971, 1999 యుద్ధాలను మర్చిపోయారా? మా సైనికుడు అబ్దుల్ హమీద్ ఒక్కడే మీ యుద్ధ ట్యాంకులను వశం చేసుకున్నాడు. మీ అమెరికా విమానాలను మేం ధ్వంసం చేశాం.
పీఎన్‌ఎస్-ఘజి ఎలా మునిగిపోయిందో గుర్తుంచుకోండి. క్షణాల్లో ఢాకాను ఎలా గెల్చుకున్నామో గుర్తుచేసుకోండి. 90 వేలమంది పాక్ ఖైదీలను జ్ఞప్తికి తెచ్చుకోండి. సిమ్లా ఒప్పందం, ఇందిరాగాంధీ సహాయాలను గుర్తుచేసుకోండి’ అని వ్యాఖ్యానించారు. ‘పాకిస్థాన్.. స్పష్టంగా విను. యుద్ధం సంభవిస్తే మీరు నామరూపాల్లేకుండా పోతారు. కశ్మీర్ ఉంటుంది. పాకిస్థాన్ మాత్రం ఉండదు’ అని ఒక సైనికుడి కవితాత్మక ప్రసంగం వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది . సైనిక స్థావరంపై దాడికి పాల్పడిన పాకిస్థాన్ ను దెబ్బకు దెబ్బకు తీయాలని పార్టీలతో సంబంధం లేకుండా పలువురు నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
https://youtu.be/NY-trj93Y64