భారతీయుడు 2..ట్రైలర్ అప్‌డేట్!

18
- Advertisement -

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘భార‌తీయుడు 2’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ కానుంది.ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందించారు.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ట్రైలర్‌ అప్‌డేట్ వచ్చేసింది. ఇవాళ సాయంత్రం 7 గంటలకి తెలుగు సహా తమిళ్ హిందీలో ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఇందుకు సంబంధించి రిలీజ్ చేసిన పోస్టర్‌ ఆకట్టుకుంటోంది. నెరిసిన గడ్డం, జుట్టు టోపీ పెట్టుకొని ఉన్న కమల్ కనిపిస్తున్నారు.

భార‌తీయుడు 2 తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హ‌క్కుల‌ను శ్రీల‌క్ష్మి మూవీస్ సంస్థ‌లు ద‌క్కించుకున్నాయి. సోనీ మ్యూజిక్ ద్వారా ‘భారతీయుడు 2’ పాటలు మార్కెట్లోకి విడుదలవుతున్నాయి.

Also Read:Bhatti:డ్రగ్స్‌తో జీవితాలు నాశనం

- Advertisement -