తొలి టెస్ట్ లో ఇండియా గెలుపు

214
india Won

భారత్, బంగ్లాదేశ్ మధ్య ఇండోర్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో ఇండియా విజయం సాధించింది. నివారం 343 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన బంగ్లాదేశ్ టీమ్.. భారత బౌలర్ల దెబ్బకి 213 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో విజయం సాధించింది. మయాంక్ అగర్వాల్ అద్భుతమైన బ్యాటింగ్‌తో డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు. విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్‌కిది 10వ ఇన్నింగ్స్ విజయం కావడం విశేషం. దీంతో రెండు టెస్టుల సిరీస్‌లో భారత్‌కు 1-0తో ఆధిక్యం లభించింది.

భారత బౌలర్లలో అశ్విన్(3/42), ఉమేశ్ యాదవ్(2/52), ఇషాంత్ శర్మ(1/31) బంగ్లాను కుప్పకూల్చారు. భారీ లక్ష్య ఛేదనలో మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ ముష్ఫికర్ రహీమ్ ఒక్కడే అర్ధశతకంతో ఆఖరి వరకు ఒంటరి పోరాటం చేశాడు. అతడు ఔటవగానే బంగ్లా ఇన్నింగ్స్ ముగియడానికి ఎంతో సమయం పట్టలేదు. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఇస్లాం(6), ఇమ్రుల్ కైస్(6), మొమినుల్ హక్(7) కనీసం రెండంకెల స్కోరు చేయలేకపోయారు.