2025 పురుషుల ఆసియా కప్ హాకీ ఛాంపియన్‌షిప్‌ను భారత్ కైవసం చేసుకుంది. కొరియాను 4-1 తేడాతో ఓడించింది. ఈ విజయంతో #WorldCupHockey 2026 కి కూడా అర్హత సాధించింది ఇండియా.
మొదటి అర్ధభాగంలో సుఖ్జీత్ సింగ్, దిల్‌ప్రీత్ సింగ్ ఒక్కో గోల్ చేసి భారత జట్టుకు 2-0 ఆధిక్యం అందించారు. రెండో అర్ధభాగంలో దిల్‌ప్రీత్ మరో గోల్ చేసి, అనంతరం అమిత్ రోహిదాస్ చివరి గోల్ కొట్టి విజయంపై ముద్ర వేశారు. సూపర్ 4లో గత మ్యాచ్‌లో భారత్-కొరియా 2-2 డ్రాగా ముగిసింది.
సూపర్ 4 దశలో భారత్ ఒక డ్రా, రెండు విజయాలతో (మలేసియా, చైనా పై) అజేయంగా నిలిచింది. కానీ కొరియా అంతగా మెరుగ్గా రాణించలేదు. సూపర్ 4లో మలేసియాతో విజయం సాధించినప్పటికీ, చైనా చేతిలో ఓటమి పాలై, మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయినా ఆ చివరి విజయం వారిని ఫైనల్‌కు చేర్చింది.
Also Read:పవన్ ప్రశంసలకు దేవిశ్రీ ఫిదా!

