Ind Vs Eng:ఐదో టెస్టు టీమిండియాదే

11
- Advertisement -

ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌;లో విజయం సాధించింది టీమిండియా. 6 పరుగుల తేడాతో విజయం సాధించడంతో అండ‌ర్స‌న్-టెండూల్క‌ర్‌ సిరీస్‌ను 2-2తో స‌మం చేసింది.

374 ప‌రుగుల ల‌క్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బ‌రిలోకి దిగిన ఇంగ్లాండ్ 367 ప‌రుగుల‌కు కుప్ప‌కూలింది. మ‌హ్మ‌ద్ సిరాజ్ ఐదు వికెట్లు తీయ‌గా, ప్ర‌సిద్ధ్ కృష్ణ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఆకాశ్ దీప్ ఓ వికెట్ సాధించాడు. ఇంగ్లాండ్ బ్యాట‌ర్ల‌లో జోరూట్ (105), హ్యారీ బ్రూక్ (111) లు శ‌త‌కాల‌తో సాధించారు.

ఓవర్ నైట్ స్కోరు 35 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు సిరాజ్ షాక్ ఇచ్చాడు. జేమీ స్మిత్ (2), జేమీ ఓవ‌ర్ట‌న్ (9)లను ఔట్ చేయగా జోష్ టంగ్ (0)ను ప్ర‌సిద్ద్ కృష్ణ ఔట్ చేశాడు. చివరగా అట్కిస్క‌న్ (17) ను సిరాజ్ బౌల్డ్ చేయడంతో టీమిండియా విజయం ఖాయమైంది.

Also Read:అనిల్ అంబానీకి ఈడీ మరో షాక్!

- Advertisement -