T20 World Cup: భారత్‌ ఘన విజయం

3
- Advertisement -

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌–2026 టోర్నీలో టీమిండియా మరో విజయాన్ని నమోదు చేసింది. యూఎస్‌ఏతో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత్‌ 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచిన యూఎస్‌ఏ ముందుగా బౌలింగ్‌ను ఎంచుకుంది.

ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 162 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా రాణిస్తూ 84 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. తిలక్ వర్మ 25 పరుగులతో కీలక భాగస్వామ్యం అందించాడు. ఇషాన్ కిషన్ 20, రింకు సింగ్ 6, అక్షర్ పటేల్ 14, హార్దిక్ పాండ్యా 5 పరుగులు చేశారు. అభిషేక్ శర్మ, శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి డకౌట్‌గా వెనుదిరిగారు. యూఎస్‌ఏ బౌలర్లలో షాడ్లీ వాన్ షాల్క్విక్ 4 వికెట్లతో చెలరేగగా, హర్మీత్ సింగ్ 2 వికెట్లు తీశాడు. అలీ ఖాన్, మొహమ్మద్ మొహ్సిన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

లక్ష్య ఛేదనలో యూఎస్‌ఏ బ్యాటింగ్ తడబడింది. మిలింద్ కుమార్ 34, సంజయ్ కృష్ణమూర్తి 37, శుభమ్ రంజానే 37 పరుగులు చేసినా జట్టును గెలుపు దిశగా నడిపించలేకపోయారు. 20 ఓవర్లలో యూఎస్‌ఏ 132/8కే పరిమితమైంది. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 3 వికెట్లు తీయగా, అర్ష్‌దీప్ సింగ్‌, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు సాధించారు. వరుణ్ చక్రవర్తి ఒక వికెట్ తీశాడు.

Also Read:రేవంత్‌కి వ్యతిరేకంగా బాధితుల ప్రచారం

- Advertisement -