వన్డేల్లో నం.1 స్థానానికి కోహ్లీసేన..

223
India win by 9 wickets, take 2-0 series ..
- Advertisement -

మరింత కసిగా చెలరేగిన టీమ్‌ ఇండియాకు మరో ఘనవిజయం. సూపర్‌ఫామ్‌లో ఉన్న కోహ్లీసేన ఆదివారం అత్యంత ఏకపక్షంగా సాగిన రెండో వన్డేలో 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను మట్టికరిపించింది. ఒక్క ఇన్నింగ్స్‌ సమయానికే మొత్తం మ్యాచ్‌ను ముగించింది. భారత మణికట్టు స్పిన్నర్లు చాహల్‌ (5/22), కుల్‌దీప్‌ (3/20) తిప్పుడుకు తిప్పలు పడ్డ ఆతిథ్య జట్టు మొదట 32.3 ఓవర్లలో 118 పరుగులకే కుప్పకూలింది. సొంతగడ్డపై వన్డే క్రికెట్లో దక్షిణాఫ్రికాకు ఇదే అత్యల్ప స్కోరు. స్వల్ప లక్ష్యాన్ని భారత్‌ 20.3 ఓవర్లలో ఒకే వికెట్‌ చేజార్చుకుని అలవోకగా ఛేదించింది. శిఖర్‌ ధావన్‌ (51 నాటౌట్‌; 56 బంతుల్లో 9×4), విరాట్‌ కోహ్లి (46 నాటౌట్‌; 50 బంతుల్లో 4×4, 1×6) బ్యాట్‌ ఝుళిపించారు. వన్డేల్లో ప్రస్తుతం టీమ్‌ ఇండియా ఈ సిరీస్‌ను గెలిస్తే నంబర్‌వన్‌ ర్యాంక్‌ నిలుస్తుంది.

India win by 9 wickets, take 2-0 series ..

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: ఆమ్లా (సి) ధోని (బి) భువనేశ్వర్‌ 23; డికాక్‌ (సి) పాండ్య (బి) చాహల్‌ 20; మార్‌క్రమ్‌ (సి) భువనేశ్వర్‌ (బి) కుల్‌దీప్‌ 8; డుమిని ఎల్బీ (బి) చాహల్‌ 25; మిల్లర్‌ (సి) రహానె (బి) కుల్‌దీప్‌ 0; జొండో (సి) పాండ్య (బి) చాహల్‌ 25; మోరిస్‌ (సి) భువనేశ్వర్‌ (బి) చాహల్‌ 14; రబాడ ఎల్బీ (బి) కుల్‌దీప్‌ 1; మోర్నీ ఎల్బీ (బి) చాహల్‌ 1; తాహిర్‌ (బి) బుమ్రా 0; శంసి నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 1 మొత్తం: (32.2 ఓవర్లలో ఆలౌట్‌) 118; వికెట్ల పతనం: 1-39, 2-51, 3-51, 4-51, 5-99, 6-107, 7-110, 8-117, 9-118; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 5-1-19-1; బుమ్రా 5-1-12-1; పాండ్య 5-0-34-0; చాహల్‌ 8.2-1-22-5; కుల్‌దీప్‌ 6-0-20-3; కేదార్‌ 3-0-11-0

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ (సి) మోర్కెల్‌ (బి) రబాడ 15; ధావన్‌ నాటౌట్‌ 51; కోహ్లి నాటౌట్‌ 46; ఎక్స్‌ట్రాలు 7 మొత్తం: (20.3 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 119; వికెట్ల పతనం: 1-26; బౌలింగ్‌: మోర్నీ మోర్కెల్‌ 4-0-30-0; రబాడ 5-0-24-1; మోరిస్‌ 3-0-16-0; ఇమ్రాన్‌ తాహిర్‌ 5.3-0-30-0; శంసి 3-1-18-0

- Advertisement -