- Advertisement -
పహల్గాంలో ఉగ్రదాడి చేసిన టీఆర్ఎఫ్ సంస్థ(TRF)ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది అమెరికా. పహల్గాం ఉగ్రదాడి తామే చేశామని బాధ్యత వహించింది లష్కరే తోయిబా ముసుగు సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్(TRF). ది రెసిస్టెన్స్ ఫ్రంట్(TRF)ను విదేశీ ఉగ్రవాద సంస్థ(FTO)గా, ప్రత్యేకంగా నియమితమైన గ్లోబల్ టెర్రరిస్ట్(SDGT) ఆర్గనైజేషన్‌గా ప్రకటించారు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో.
మరోవైపు పహల్గాం ఉగ్రదాడితో మాకు సంబంధం లేదు అని పాక్ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు. ఉగ్రదాడిలో ప్రాణనష్టం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నామని వెల్లడించారు.
Also Read:విజయ్ -నిత్యా…’సార్ మేడమ్’
లష్కర్-ఎ-తయ్యిబా (LeT)కి అనుబంధమైన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (TRF)ను విదేశీ ఉగ్రవాద సంస్థగా గుర్తించినందుకు అమెరికాను భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ప్రశంసించారు.
- Advertisement -

