దేశంలో గూఢచర్యానికి పాల్పడుతున్న ఇద్దరు పాకిస్థాన్ దౌత్య ఉద్యోగులను ఢిల్లీ పోలీసులు, నిఘా వర్గాలు కాపుకాసి పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వారిని భారత్ బహిష్కరించగా పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.
భారత దౌత్య అధికారులను వెంబడించడం.. వారి ఇంటి వద్ద నిఘా పెంచడం వంటి చర్యలు చేస్తుండటంతో వారి కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడుతోంది.ఈ నేపథ్యంలో తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన భారత్..పాక్ చర్యలు ఇరు దేశాల మధ్య కుదిరిన 1961 నాటి వియన్నా ఒప్పందం, దౌత్య సంబంధాలు,1992 నాటి ద్వైపాక్షిక ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించేలా ఉన్నాయని మండిపడింది. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్, సిబ్బందికి భద్రత కల్పించి, సాధారణ కార్యకలాపాల నిర్వహణకు సహకరించాలని కోరింది.
గూఢచర్యం ఆరోపణలతో పాక్ అధికారిని 2016 లో భారత్ చివరిసారిగా బహిష్కరించగా.. ఇది జరిగిన మూడు రోజుల తర్వాత ఇస్లామాబాద్‌లోని ఒక భారతీయ అధికారిని పాక్ బహిష్కరించింది.