వెస్టిండీస్‌తో ఇవాళ మూడో వన్డేలో తలపడనుంది భారత్. ఇప్పటికే రెండు వన్డేలు గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న భారత్…విండీస్‌ను వైట్ వాష్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. పలు మార్పులతో భారత్ బరిలోకి దిగుతుండగా విండీస్ ఎలాగైనా ఈ మ్యాచ్ గెలవాలని పట్టుదలతో ఉంది.
ఈ మ్యాచ్‌లో ధావన్‌తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనుండగా సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడాలలో ఒకరికి తుదిజట్టులో ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. సిరీస్‌ను కోల్పోయిన కరీబియన్ జట్టు ఇప్పుడు ఆఖరి మ్యాచ్ విజయంపైనే ఆశలు పెట్టుకుంది. షై హోప్, బ్రాండన్ కింగ్, బ్రేవో, నికోలస్ పూరన్‌లతో వెస్టిండీస్ బ్యాటింగ్ ఆర్డర్ చెప్పుకునేందుకు పటిష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఎవరూ రాణించలేకపోతున్నారు.
జట్లు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), ధావన్, కోహ్లి, రాహుల్, పంత్, దీపక్ హుడా / సూర్యకుమార్, వాషింగ్టన్ సుందర్, శార్దుల్, సిరాజ్, చహల్ / కుల్దీప్, ప్రసిధ్ కృష్ణ.
వెస్టిండీస్: పొలార్డ్ (కెప్టెన్), షై హోప్, బ్రండన్ కింగ్, డారెన్ బ్రేవో, బ్రూక్స్, పూరన్, హోల్డర్, ఫ్యాబియన్ అలెన్, హోసీన్, జోసెఫ్, రోచ్.