ఉప్పల్‌లో అజేయ భారత్‌…

224
india vs westindies
- Advertisement -

రాజ్‌కోట్ టెస్టులో సాధించిన విజయంతో మంచి జోష్‌ మీదుంది టీమిండియా. శుక్రవారం(రేపటి నుండి) వెస్టిండీస్‌తో ఉప్పల్‌లో ప్రారంభం కానున్న టెస్టుకు సిద్ధమైంది. బలమైన టీమిండియాను ఒడించడం విండీస్‌కు కష్టమైన పని. అది ఉప్పల్‌ మరి గగనమే. ఉప్పల్‌ స్టేడియంలో భారత్‌ ఓటమి అనేది ఎరుగదు. ఈ స్టేడియంలో టీమిండియా తొలిమ్యాచ్‌ న్యూజిలాండ్‌తో తలపడగా ఆ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. తర్వాతి మూడు టెస్ట్‌ల్లో టీమిండియా ఘన విజయాలు నమోదు చేసింది.

2014లో వెస్టిండీస్‌ భారత్‌లో పర్యటించినప్పుడు మూడు టెస్ట్‌ల సిరీస్ లో మొదటి మ్యాచ్‌ ఉప్పల్‌లో జరగాల్సి ఉంది. కానీ హుద్ హుద్ తుఫాన్‌ కారణంగా రద్దయింది. తిరిగి నాలుగు సంవత్సరాల తర్వాత మ్యాచ్ జరుగుతుండటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఉప్పల్ టెస్టు నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మ్యాచ్ జరిగే రోజుల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు.

India vs West Indies: If it’s Hyderabad, it’s gotta be the Pujara-Ashwin show

ఆసీస్ పర్యటనకు ముందు జట్టులో పలు మార్పులు చేసి రిజర్వ్ ఆటగాళ్లకు చోటు కల్పించాలని టీమిండియా భావిస్తోంది. కెప్టెన్‌ కోహ్లీ విశ్రాంతి తీసుకొని.. అజింక్యా రహానెకు సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. కర్ణాటక బ్యాట్స్‌మన్‌ మయాంక్‌ అగర్వాల్‌, హైదరాబాద్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ టెస్ట్‌ అరంగేట్రం చేసే చాన్సుంది.

ఇరు జట్లు టెస్ట్‌ల్లో ఇప్పటివరకూ 95 సార్లు తలపడ్డాయి. అయితే 30-19తో విండీస్‌ తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. ఇక 46 టెస్ట్‌ల్లో ఫలితం తేలలేదు. భారత్‌లో ఇరు జట్లు 46 మ్యాచ్‌ల్లో తలపడగా.. వెస్టిండీస్‌ 14 సార్లు, భారత్‌ 12సార్లు గెలిచాయి. 20 టెస్ట్‌లు డ్రా అయ్యాయి.

- Advertisement -