వెస్టిండీస్-భారత్ మధ్య టెస్టు సమరానికి సర్వం సిద్దమైంది. ఇంగ్లాండ్‌తో సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ భావిస్తోండగా…టీమిండియాను మట్టికరిపించాలని విండీస్ ఉవ్విళ్లూరుతోంది. అయితే సొంతగడ్డపై భారత్‌ను ఆపడం విండీస్‌కు కష్టమైన పని. రాజ్‌కోట్ వేదికగా ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానుంది.
2013 తర్వాత భారత్‌లో టెస్టు మ్యాచ్ ఆడడం విండీస్‌కు ఇదే తొలిసారి కావడం విశేషం. తుదిజట్టులో పలు మార్పులు చేసిన కోహ్లీసేన కుర్రాళ్లకు అవకాశమిచ్చింది. ముంబయి యువ సంచలనం పృథ్వీ షా ఈ మ్యాచ్‌తో టెస్టు ఆరంగేట్రం చేయనున్నారు. కేఎల్ రాహుల్‌తో కలిసి పృథ్వీ ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు.
ప్రధాన పేసర్లు బుమ్రా,భువనేశ్వర్‌కు సెలక్టర్లు విశ్రాంతినివ్వడంతో బౌలింగ్ బాధ్యతను భుజాన వేసుకోనున్నారు షమి,ఉమేశ్ యాదవ్. మూడో పేసర్‌ను తీసుకోవాలనుకుంటే శార్దుల్ ఠాకూర్ ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేస్తాడు. 15 మంది సభ్యుల కరీబియన్ జట్టులో ఐదుగురికి మాత్రమే భారత్‌లో టెస్టు మ్యాచ్ ఆడిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై బలమైన భారత్‌ను అడ్డుకోవడం ఆ జట్టుకు సవాలే.
భారత్ : విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, పృథ్వీ షా, చెతేశ్వర్ పుజారా, అజింక్య రహానె, రిషబ్ పంత్, అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ షమి, ఉమేశ్ యాదవ్, శార్దుల్ ఠాకూర్.
వెస్టిండీస్: జాసన్ హోల్డర్ (కెప్టెన్), సునీల్ ఆంబ్రిస్, దేవేంద్ర బిషూ, క్రెయిగ్ బ్రాత్‌వైట్, రోస్టన్ చేజ్, షేన్ డౌరిచ్, షానోన్ గాబ్రియెల్, జమర్ హామిల్టన్, షిమ్రోన్ హెట్‌మయర్, షై హోప్, షెర్మాన్ లూయిస్, కీమో పాల్, కీరన్ పావెల్, కెమర్ రోచ్, జోమెల్ వారిసన్.