నేడే భారత్ – విండీస్ 3వ వన్డే..

566
india vs west indies
- Advertisement -

ఇవాళ భారత్ – విండీస్ మధ్య కటక్ వేదికగా మూడో వన్డే జరగనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ జరగనుంది. మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ముగియగా.. సిరీస్ 1-1తో ప్రస్తుతం సమమైంది. దీంతో విజేత నిర్ణయాత్మక కటక్ వన్డేపై సర్వత్రా ఆసక్తి నెలకొనగా హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది టీమిండియా.

బ్యాటింగ్‌ విభాగంలో భారత్‌ పటిష్టంగా ఉంది. ఓపెనర్లు రోహిత్, రాహుల్‌ తిరుగులేని బ్యాటింగ్‌ మరోసారి భారత్‌కు శుభారంభం అందిస్తే ప్రత్యర్థికి కష్టాలు తప్పవు. దీనికి తోడు కోహ్లీ ఫామ్‌లోకి వస్తే కరేబియన్ బౌలర్లకు చిక్కులు తప్పవు.

ఇక కటక్ వన్డేలో కుల్దీప్ యాదవ్ ఒక్క వికెట్ పడగొట్టగలిగితే..? వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్ల మైలురాయిని అందుకున్న భారత స్పిన్నర్‌గా అరుదైన ఘనత సాధించనున్నాడు.

రెండో వన్డేలో బ్యాట్స్‌మెన్స్‌తోపాటు బౌలర్లూ విఫలమయ్యారు. స్పిన్నర్‌ ఖారీ పైర్‌ బౌలింగ్‌పై విండీస్‌ ఆశలుపెట్టుకుంది. బ్యాటింగ్‌లో హోప్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉండగా, మరో ఓపెనర్‌ లూయిస్‌ కూడా చెలరేగిపోతున్నాడు. ఇక హెట్‌మేయర్‌ కూడా రాణిస్తే.. మ్యాచ్‌ను మలుపు తిప్పేయగలడు. మొత్తంగా విండీస్‌ను ఓడించి 2019ని ఘనంగా ముగించాలని కోహ్లీ సేన పట్టుదలతో ఉంది.

- Advertisement -