ఉప్పల్ టెస్టు:తడబడి నిలబడ్డ విండీస్

209
India vs West Indies
- Advertisement -

ఉప్పల్ వేదికగా భారత్‌-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో కరీబియన్ టీం భారత బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ ఆరంభంలో తడబడింది. తొలి రెండు సెషన్లలో భారత బౌలర్లు విజృంభించారు. ఫస్టాఫ్‌లో విండీస్‌ 3 వికెట్లు కొల్పోగా సెకండాఫ్‌లో కూడా తడబడింది. ఈ క్రమంలో క్రీజ్‌లోకి వచ్చిన రోస్టన్ ఛేజ్‌,కెప్టెన్ జాసన్ హోల్డర్‌ జట్టును గట్టెక్కించే బాధ్యతను భుజాన వేసుకున్నారు.

తొలిరోజు ఆటముగిసే సమయానికి వెస్టిండీస్‌ 95 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. రోస్టన్‌ ఛేజ్‌ (174 బంతుల్లో 98 బ్యాటింగ్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీకి చేరువ కాగా, కెప్టెన్‌ హోల్డర్‌ (92 బంతుల్లో 52; 6 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 104 పరుగులు జోడించడం విశేషం.

షై హోప్‌ (68 బంతుల్లో 36; 5 ఫోర్లు) ,హెట్‌మెయిర్‌ (12), ఆంబ్రిస్‌ (18),కీపర్‌ డౌరిచ్‌ ( 30 ‌) కలిసి జట్టును ఆదుకున్నారు. భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్, ఉమేశ్‌ యాదవ్‌ చెరో 3 వికెట్లు పడగొట్టారు.కెరీర్‌లో తొలిటెస్టు ఆడుతున్న భారత బౌలర్‌ శార్దుల్‌ గాయం కారణంగా కేవలం 3 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి తప్పుకోవడంతో పేస్‌ భారాన్ని ఉమేశ్‌ ఒక్కడే మోశాడు. చక్కటి స్వింగ్‌తో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టారు.

మొదటి రోజును విండీస్‌ సంతృప్తిగా ముగించగా… ప్రత్యర్థిని ఆలౌట్‌ చేయలేక టీమిండియా నిరాశకు గురైంది. విండీస్‌ టాప్‌–8 బ్యాట్స్‌మెన్‌ కనీసం రెండంకెల స్కోరు చేయడం మూడేళ్ల తర్వాత ఇదే తొలిసారి కాగా… భారత్‌పై 1994 తర్వాత ఇదే మొదటిసారి కావడం విశేషం.

- Advertisement -