వెస్టిండీస్ పై వరుసగా టీ20, వన్డే సిరీస్‌లను క్లీన్‌స్వీప్ చేసిన భారత్ టెస్టు సిరీస్‌ని గెలిచేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఆంటిగ్వా వేదికగా నేటినుంచి రాత్రి 7 గంటల నుంచి తొలి టెస్టు ప్రారంభంకానుంది. అయితే తుది జట్టు ఎంపిక టీమ్ మేనేజ్‌మెంట్‌కి కష్టంగా మారింది.
ఇషాంత్ శర్మ, అశ్విన్ సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ మైదానంలోకి దిగనుండగా టీ20, వన్డేలకి దూరంగా ఉన్న బుమ్రా జట్టుతో చేరాడు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌కి జోడిగా కేఎల్ రాహుల్ లేదా హనుమ విహారి ఎవరు వస్తారనే సస్పెన్స్ కొనసాగుతోంది.దీంతో పాటు సీనియర్ వికెట్ కీపర్ సాహాకి ఛాన్సిస్తారా..? లేక ఇటీవల టీ20, వన్డేల్లో తేలిపోయిన రిషబ్ పంత్‌కి మరో అవకాశమిస్తారా..? అనేది చూడాలి.
వన్డే,టీ20 సిరీస్ ఓటమితో ఢీలా పడ్డ విండీస్ టెస్టు సిరీస్ గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. సీనియర్ క్రికెటర్లు క్రెయిగ్ బ్రాత్‌వైట్, డారెన్ బ్రావో, ఛేజ్, కీమర్ రోచ్ జట్టులో ఉండగా కెప్టెన్ జేసన్ హోల్డర్ ఇటీవల ఆల్‌రౌండర్ ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. రకీమ్ కార్న్‌వాల్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.