నేటి నుంచి భారత్‌-విండీస్‌ వన్డే సిరీస్‌..

262
- Advertisement -

వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ను అలవోకగా 2-0తో సొంతం చేసుకున్న టీమ్‌ ఇండియా.. ఇక వన్డే పోరుకు సిద్ధమైంది. ఆ జట్టుతో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ ఆదివారం జరగనుంది. టెస్టుల్లో తేలిపోయిన విండీస్‌.. వన్డేల్లో అయినా పోటీ ఇస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆ జట్టు కొంచెం మెరుగ్గానే ఆడుతున్న నేపథ్యంలో సిరీస్‌ ఆసక్తికరంగా సాగుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. కెప్టెన్‌ హోల్డర్‌, సీనియర్‌ ఆల్‌రౌండర్‌ శామ్యూల్స్‌, స్పిన్నర్‌ దేవేంద్ర బిషూ, యువ పేసర్‌ అల్జారి జోసెఫ్‌ లాంటి ఆటగాళ్లపై విండీస్‌ ఆశలు పెట్టుకుంది. మరి కొద్ది గంటల్లో అట మొదలు కానుంది.

India vs West Indies

వన్డే సిరీస్‌లో భారత్‌ ప్రధానంగా దృష్టిపెడుతున్నది మిడిలార్డర్‌ మీదే. ఓపెనర్లు రోహిత్‌, ధావన్‌ నిలకడగానే ఆడుతున్నారు. మూడో స్థానంలో ఆడే కోహ్లి గురించి చెప్పాల్సిన పని లేదు. బౌలింగ్‌లో ఇటు ఫాస్ట్‌బౌలర్లు, అటు స్పిన్నర్లు రాణిస్తున్నారు. కానీ మిడిలార్డర్‌ బ్యాటింగే సమస్యగా మారుతోంది. టాప్‌ఆర్డర్‌ చాలా మ్యాచ్‌ల్లో భారత్‌కు విజయాలందిస్తుండగా.. టాప్‌-3 బ్యాట్స్‌మెన్‌ విఫలమైనపుడు మిడిలార్డర్‌ ఒత్తిడి ఎదుర్కొంటోంది.

తుది జట్లు (అంచనా)..
భారత్‌: రోహిత్‌, ధావన్‌, కోహ్లి (కెప్టెన్‌), రాయుడు, పంత్‌, ధోని (వికెట్‌ కీపర్‌), జడేజా, కుల్‌దీప్‌, చాహల్‌, ఉమేశ్‌, షమి/ఖలీల్‌.

వెస్టిండీస్‌: ఆంబ్రిస్‌, కీరన్‌ పావెల్‌, హోప్‌ (వికెట్‌ కీపర్‌), హెట్‌మయర్‌, శామ్యూల్స్‌, రోమన్‌ పావెల్‌, హోల్డర్‌ (కెప్టెన్‌), నర్స్‌, కీమో పాల్‌, బిషూ, అల్జారి జోసెఫ్‌/రోచ్‌.

- Advertisement -