2023 సంవత్సరం తొలి మ్యాచ్ను శ్రీలంకతో ఆడేందుకు సిద్ధమైంది భారత్. హార్థిక్ పాండ్యా టీ20లకు కెప్టెన్గా వ్యవహరించనుండగా ముంబై వేదికగా సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.
భారత్ – శ్రీలంక జట్లు ఆసియా కప్-2022లో చివరిసారిగా తలపడ్డాయి. ఇందులో టీమిండియా ఓటమిని చవిచూసింది. ఈ రోజు జరిగే మ్యాచ్లో ఓపెనర్లుగా ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్లు క్రిజ్లోకి వచ్చే అవకాశం ఉంది. రితురాజ్ గైక్వాడ్ కూడా జట్టు లో ఉన్నాడు. వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాల్గో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చే అవకాశం ఉంది.
ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక, అర్ష్దీప్ సింగ్లతో భారత్ బరిలోకి దిగే అవకాశం ఉంది.
తుదిజట్టు అంచనా..
భారత్: ఇసాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభమన్ గిల్, సంజుశాంసన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), వాషిగ్టన్ సుందర్, హర్షల్ పటేల్, యుజువేంద్ర చాహల్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్ దీప్ సింగ్.
శ్రీలంక జట్టు: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), భానుక రాజపక్సే, ధనంజయ్ డిసిల్వా, చరిత్ అస్లంక, దసున్ షనక్ (కెప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహిష్ తీక్షణ, లహిరు కుమార, ప్రమోద్ మదుషన్
ఇవి కూడా చదవండి..