భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి దూసుకుపోతున్నాడు. వరుసగా రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. తాజాగా కోహ్లి మరో ఘనత సాధించాడు. అన్ని ఫార్మట్లలో కలిపి అలవోకగా 50 శతకాలు సాధించిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి మరో శతకం సాధించాడు.
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ భారత తొలి ఇన్నింగ్స్ మూడు రోజు ఆటలో 130 బంతుల్లో 10 ఫోర్లతో సెంచరీ పూర్తిచేసుకున్నాడు. కోహ్లి టెస్ట్ కెరీర్ లో ఇది 19వ సెంచరీ.

ఈ సెంచరీతో కెప్టెన్ గా రికీ పాంటింగ్, సునీల్ గవాస్కర్ ల పేరిట ఉన్న రికార్డులను కోహ్లి అధిగమించాడు. ఒక క్యాలెండర్ ఇయర్ లో పది సెంచరీలతో పాంటింగ్ రికార్డు బద్దలు కొట్టగా.. భారత కెప్టెన్ గా 12వ సెంచరీతో గవాస్కర్ ను వెనక్కి నెట్టాడు. గతంలో ఈ జాబితాలో సునీల్ గవాస్కర్ 11 సెంచరీలతో ప్రథమ స్థానంలో నిలువగా.. ఇప్పుడు దాన్ని కోహ్లీ అధిగమించాడు.
ఈ సెంచరీతో టెస్టు కెరీర్ లో భారత జట్టు కెప్టెన్ గా కోహ్లీ 12వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక రెండో రోజు రెండు సెంచరీలు( మురళి విజయ్, పుజారా) నమోదుకాగా మూడో రోజు మూడో సెంచరీ నమోదు కావడం విశేషం. మొత్తానికి క్రికెట్‌లో రాటు తేలిన కోహ్లీ సెంచరీలతో దూసుకుపోతున్నాడు

