భారత్ – దక్షిణాఫ్రికా మధ్య జరిగే వన్డే రద్దు అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే వర్షం కారణంగా తొలి వన్డే రద్దు కాగా కరోనా నేపథ్యంలో ప్రేక్షకులను స్టేడియంలలోకి అనుమతించేది లేదని కేంద్రం తేల్చిచెప్పడంతో బీసీసీఐ పలు టోర్నీలను రద్దు చేసింది. ఇక కరోనా ఎఫెక్ట్‌తో ఐపీఎల్ షెడ్యూల్‌ను కూడా మర్పుచేశారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం భారత్- దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్‌ను రద్దు చేసినట్లు వార్తలు వెలువుడుతన్నాయి. లక్నోలో ఆదివారం, కోల్‌కతాలో బుధవారం మిగిలిన రెండు మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. దీంతో భారత క్రికెటర్లు త్వరలోనే వారి ఇళ్లకి వెళ్లనుండగా.. దక్షిణాఫ్రికా క్రికెటర్లు మాత్రం కొన్ని రోజులు భారత్‌లోనే ఉండే అవకాశం ఉంది.
ఇక కరోనా నేపథ్యంలో వరుసగా క్రికెట్ సిరీస్‌లను ఆయా దేశాల క్రికెట్ బోర్డులు రద్దు చేస్తున్నాయి. ముంబయిలో జరుగుతున్న రోడ్ సేప్టీ టీ20 వరల్డ్ సిరీస్‌ని రద్దు చేస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రకటించగా.. మార్చి మూడో వారంలో బంగ్లాదేశ్ వేదికగా జరగాల్సిన వరల్డ్ ఎలెవన్ vs ఆసియా ఎలెవన్ టీ20 సిరీస్‌ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వాయిదా వేసింది.