తొలిటెస్టులో సఫారీలను మట్టికరిపించిన కోహ్లీ సేన రెండో టెస్టులో కూడా అదే జోరు కంటిన్యూ చేస్తోంది. పుణె టెస్టులో తొలిరోజు ముగిసే సమయానికి భారత్ భారీ స్కోరు సాధించగా రెండోరోజు కూడా అదే దిశగా సాగుతోంది. ప్రస్తుతం కోహ్లీ 73,రహానే 24 పరుగులతో క్రీజులో ఉండగా 3 వికెట్లు కొల్పోయి 291 పరుగులు చేసింది.
తొలిరోజు ఆటలో స్టార్ అట్రాక్షన్‌గా నిలిచింది మయాంక్ అగర్వాల్. తొలి టెస్టులో సెంచరీ చేసిన మయాంక్…రెండో టెస్టులోనూ సెంచరీ సాధించాడు. మయాంక్ (108: 195 బంతుల్లో 16×4, 2×6) రాణించగా చతేశ్వర్ పుజారా (58: 112 బంతుల్లో 9×4, 2×6) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
ఇక ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ క్రమశిక్షణ తప్పాడు. తొలిరోజు రెండో సెషన్‌లో చతేశ్వర్ పుజారాపై మైదానంలోనే రబాడ స్లెడ్జింగ్‌కి దిగాడు.నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2015లో భారత్ సిరీస్‌తో వెలుగులోకి వచ్చిన కగిసో రబాడ.. ఈ నాలుగేళ్ల వ్యవధిలో ప్రతిభ కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచాడు.