Ind Vs SA:7 వికెట్ల తేడాతో టీమిండియా గెలుపు

29
- Advertisement -

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో తొలి టెస్టు ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడమే కాకుండా సిరీస్‌ను సమం చేసింది. సఫారీలు విధించిన 79 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కొల్పోయి 12 ఓవర్లలో చేధించింది. జైస్వాల్ 28,గిల్ 10,విరాట్ 12 పరుగులు చేయగా రోహిత్ శర్మ 17 నాటౌట్‌,శ్రేయాస్ 4 నాటౌట్‌గా నిలిచారు.

ఇక అంతకముందు రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 36.5 ఓవర్లలో 176 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్‌ ఎయిడెన్‌ మార్క్‌రమ్‌ 103 బంతుల్లో 17 ఫోర్లు, 2 సిక్స్‌లతో 106 పరుగులు చేయగా మిగితా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ 6 వికెట్లు తీయగా, రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా 6 వికెట్లు తీసి సఫారీల పతనాన్ని శాసించాడు.

Also Read:తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్

- Advertisement -