భారత్ vs పాకిస్థాన్..మ్యాచ్ ప్రివ్యూ?

4
- Advertisement -

టీ20 వరల్డ్ కప్ 2026లో 27వ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. కొన్ని వారాలుగా కొనసాగిన వివాదాల అనంతరం ఈ మ్యాచ్ అధికారికంగా ఖరారైంది.

భారత్–బంగ్లాదేశ్ వివాదం తర్వాత పాకిస్థాన్ బంగ్లాదేశ్‌కు మద్దతుగా నిలిచింది. ఫిబ్రవరి 15న భారత్‌తో ఆడేందుకు తమ జట్టును అనుమతించబోమని పాకిస్థాన్ ప్రభుత్వం మొదట నిరాకరించింది. అయితే పలు చర్చల అనంతరం మ్యాచ్ నిర్వహించేందుకు అంగీకారం తెలిపారు.

ఇప్పటివరకు టీ20 వరల్డ్ కప్‌లలో భారత్, పాకిస్థాన్ మొత్తం ఎనిమిది సార్లు తలపడ్డాయి. అందులో భారత్ ఏడు విజయాలు సాధించగా, పాకిస్థాన్ కేవలం ఒకసారి మాత్రమే గెలిచింది. ఈ ఆధిపత్య రికార్డును మరింత బలోపేతం చేయాలని టీమ్ ఇండియా ఆశిస్తోంది.

గ్రూప్ స్థితిగతులు పరిశీలిస్తే, రెండు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో భారత్ నాలుగు పాయింట్లతో గ్రూప్‌లో మొదటి స్థానంలో ఉంది. 3.05 నెట్ రన్ రేట్‌తో ఇతర జట్లకంటే ముందంజలో ఉంది. మరోవైపు, సల్మాన్ అలీ ఆఘా నేతృత్వంలోని పాకిస్థాన్ కూడా రెండు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించి నాలుగు పాయింట్లు సంపాదించింది. అయితే తక్కువ నెట్ రన్ రేట్ కారణంగా గ్రూప్‌లో రెండో స్థానంలో ఉంది.

Also Read:పచ్చి కూరగాయలు తింటున్నారా?

- Advertisement -