కుల్దీప్ స్ధానంలో చాహల్..ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

427
virat kohli
- Advertisement -

నూజిలాండ్ లో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో భాగంగా రెండో టీ20లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది భారత్. సిరీస్ రేసులో నిలవాలంటే మ్యాచ్‌లో భారత్ తప్పక నెగ్గాల్సిన తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది. షమీ స్ధానంలో నవదీప్, కుల్దీప్ స్ధానంలో చాహల్‌ని తుదిజట్టులోకి తీసుకున్నారు.

న్యూజిలాండ్ ను తక్కువ స్కోర్ కు ఔట్ చేసి లక్ష్యాన్ని ఛేదించాలనే లక్ష్యంతో బరిలోకి దిగింది. హామిల్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో విజేత ఎవరు అన్నది మరికొన్ని గంటల్లోనే తేలిపోతుంది.

టీం ఇండియా :

మయాంక్‌, పృథ్వీ షా, కోహ్లి, శ్రేయస్‌, రాహుల్‌, మనీశ్‌, జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, చాహల్‌, నవదీప్‌ సైని, బుమ్రా

న్యూజిలాండ్ :

గప్తిల్‌, నికోల్స్‌, బ్లండెల్‌, టేలర్‌, లేథమ్‌, గ్రాండ్‌హోమ్‌, నీషమ్‌, బెనెట్‌, సౌథీ, జేమిసన్‌, మార్క్‌ చాప్‌మన్‌

- Advertisement -