టీమిండియాల…. మన గల్లీ పోరడు

243
- Advertisement -

కీవిస్‌తో జరగబోయే టీ 20 సిరీస్‌కు జట్టును ఎంపిక చేసింది బీసీసీఐ. ఐపీఎల్‌లో సత్తాచాటిన హైదరాబాదీ కుర్రాడు మహ్మద్ సిరాజ్ ఎంపికయ్యాడు. అతనితోపాటు శ్రేయాస్ అయ్యర్‌కు కూడా సెలక్టర్లు చాన్సిచ్చారు. ఈ టీమ్‌లో పేస్‌బౌలర్ ఆశిష్ నెహ్రా కూడా ఎంపికయ్యాడు. నెహ్రా ఒక టీ20 మాత్రమే ఆడనున్నాడు. ఢిల్లీలో జరిగే తొలి టీ20తోనే అతను రిటైరవనున్న విషయం తెలిసిందే.

అండర్-23 టోర్నీ నుంచి మొదలుపెట్టి, ముస్తాక్ అలీ, హజారే, రంజీ ట్రోఫీ, భారత్ ఎ ,ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు  మహమ్మద్ సిరాజ్ . ఐపీఎల్‌లో కళ్లుచెదిరే ఇన్‌స్వింగ్, ఔట్‌స్వింగర్లతో బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టిన సిరాజ్‌ తాజాగా టీమిండియా జట్టులో చోటు దక్కించుకున్నాడు.

దాదాపు 46 ఏళ్ల గ్యాప్ తర్వాత హైదరాబాదీ  ఫాస్ట్ బౌలర్ టీమిండియాకు ఎంపికయ్యాడు. 1971లో మాజీ పేసర్ గోవిందరాజ్  వెస్టిండీస్ టూర్‌కు వెళ్లాడు. 23 ఏళ్ల సిరాజ్ గత ఏడాది రంజీ సీజన్‌లో మొత్తం 41 వికెట్లు తీసుకుని మూడవ అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు.

India vs New Zealand: Mohammed Siraj included in T20 squad

సిరాజ్ బౌలింగ్‌లో పేస్ ఉందని, డొమెస్టిక్ సీజన్ కూడా అద్భుతంగా ఉందని, అతను మనసు పెట్టి అన్నీ నేర్చుకుంటున్నాడని, అదో మంచి సంకేతమని వార్నర్ ఇటీవల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. సిరాజ్ బౌలింగ్ చాలా ఉత్తేజాన్ని నింపుతుందని లక్ష్మణ్ అన్నాడు. సెలెక్టర్ల దృష్టిలో పడ్డ సిరాజ్‌ను ఇటీవల ఇండియా ఏ టీమ్‌కు సెలక్ట్ చేశారు.

టీ20 టీమ్: విరాట్ కోహ్లి, ధావన్, రోహిత్, రాహుల్, మనీష్ పాండే, శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తీక్, ఎమ్మెస్ ధోనీ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, చాహల్, కుల్‌దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్, నెహ్రా, మహ్మద్ సిరాజ్

ఇక శ్రీలంకతో జరగబోయే టెస్ట్ సిరీస్‌కు కూడా టీమ్‌ను ఎంపిక చేశారు. ఇందులో రహానేను వైస్ కెప్టెన్‌గా నియమించారు. నవంబర్ 16 నుంచి కోల్‌కతాలో మూడు టెస్ట్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత మూడు వన్డేలు, మూడు టీ20లు జరగనున్నాయి. న్యూజిలాండ్ సిరీస్ పూర్తవగానే శ్రీలంక భారత్ రానుంది.

శ్రీలంకతో టెస్ట్ సిరీస్ టీమ్: కోహ్లి, రాహుల్, విజయ్, ధావన్, రహానే, పుజారా, రోహిత్, సాహా, అశ్విన్, జడేజా, కుల్‌దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా, షమి, ఉమేష్, భువనేశ్వర్, ఇషాంత్ శర్మ

- Advertisement -