రెండో టెస్టు : పృథ్వీ షా హాఫ్‌ సెంచరీ

216
ind vs nz

క్రైస్ట్ చర్చ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్‌ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బౌలింగ్‌కు దిగిన్ భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. మయాంక్ అగర్వాల్ కేవలం 7 పరుగులకే వెనుదిరగగా మరో ఓపెనర్ పృథ్వీ షా మాత్రం హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 64 బంతుల్లో 8 ఫోర్లు,ఒక సిక్సర్‌తో 54 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టగా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి నిరాశ పర్చాడు. కేవలం 3 పరుగులు మాత్రమే చేసి సౌథి బౌలింగ్‌లో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో పుజారా(28),రహానే(3) క్రీజులో ఉన్నారు. కివీస్ బౌలర్లలో సౌథి,బోల్ట్,జేమీసన్ తలో వికెట్ తీశారు.

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో అప్రతిహతంగా దూసుకెళ్తున్న టీమ్‌ఇండియాకు న్యూజిలాండ్‌తో మొదటి టెస్టులో భారీ షాక్‌ తగిలిన సంగతి తెలిసిందే. ప్రాక్టీస్‌ సెషన్‌లో గాయపడ్డ యువ ఓపెనర్‌ పృథ్వీ షా ఫిట్‌నెస్‌ సాధించగా.. జోరుమీదున్న ఇషాంత్‌ శర్మ బెంచ్‌కు పరిమితమయ్యాడు.

మరోవైపు ఇప్పటికే ట్రెంట్‌ బౌల్ట్‌, టిమ్‌ సౌథీ, జెమీసన్‌, గ్రాండ్‌హోమ్‌తో పటిష్ఠంగా ఉన్న బ్లాక్‌క్యాప్స్‌ బౌలింగ్‌ లైనప్‌నకు వాగ్నర్‌ కూడా తోడవతుండటం న్యూజిలాండ్‌కు మరింత ఉత్సాహాన్నిస్తున్నది.

తుది జట్లు

భారత్‌: కోహ్లీ (కెప్టెన్‌), మయాంక్‌, పృథ్వీ షా, పుజారా, రహానే, విహారి, పంత్‌, జడేజా, ఉమేశ్‌, షమీ, బుమ్రా

న్యూజిలాండ్‌: విలియమ్సన్‌ (కెప్టెన్‌), లాథమ్‌, బ్లండెల్‌, టేలర్‌, నికోల్స్‌, వాట్లింగ్‌, గ్రాండ్‌హోమ్‌, జెమీసన్‌ , సౌథీ, వాగ్నర్‌, బౌల్ట్‌