కోహ్లీసేన చేతిలో కివీస్‌ చిత్తు..

91
India vs New Zealand, 3rd ODI live cricket score

కాన్పూర్ వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియా విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకుంది. న్యూజిలాండ్ పై 6 పరుగుల తేడాతో కివీస్‌ను చిత్తు చేసింది.  మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ ను 2-1తో గెలుచుకుని, టీమిండియా విజేతగా నిలిచింది.

కాగా, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 337 పరుగులు చేసింది. అనంతరం 338 పరుగుల భారీ విజయ లక్ష్యంతో న్యూజిలాండ్ జట్టు బరిలోకి దిగింది. న్యూజిలాండ్ చివరి వరకు పోరాడి ఓడింది.

29 పరగుల వద్ద శిఖర్ ధవన్ (14)ను ఔట్ చేసిన ఆనందం కివీస్‌కు మిగల్లేదు. కోహ్లీ, రోహిత్ శర్మలు కలిసి న్యూజిలాండ్ బౌలర్లను ఉతికి ఆరేశారు. 138 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 18 ఫోర్లు, 2 సిక్సర్లతో 147 పరుగులు చేసి ఔటవగా, కెప్టెన్ కోహ్లీ 106 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్‌తో వన్డేల్లో 32వ సెంచరీ నమోదు చేశాడు. అంతేకాక వన్డేల్లో అతి తక్కువ మ్యాచుల్లో 9వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగానూ రికార్డు సృష్టించాడు.

హార్ధిక్ పాండ్యా 8, ధోనీ 25, కేదార్ జాదవ్ 18, దినేశ్ కార్తీక్ 4(నాటౌట్) పరుగులు చేశారు.
కివీస్ బౌలర్లలో టిమ్ సౌథీ, ఆడం మిల్నె, మిచెల్ సాంట్నర్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.