ఆడారు.. అయినా ఓడారు

175
- Advertisement -

భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య ఫిరోజ్‌ షా కోట్లలో చివరి వరకు ఉత్కంఠగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఓటమి పాలయ్యింది. న్యూజీలాండ్ ఆరు పరుగుల తేడాతో గెలుపొందింది. 243 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఓపెనర్ రోహిత్ శర్మ (15) పరుగులు చేసి ట్రంట్ బౌల్ట్ బౌలింగ్ లో అవుటయ్యాడు. తర్వాత కోహ్లీ(9),రహానే (28), పాండే (19) అవుటవడంతో టీమిండియా కష్టాల్లో పడింది. తరువాత పాండే(19) రనౌట్ అయ్యాడు.

కేదార్ జాదవ్‌(41) దూకుడుగా ఆడగా.. ధోనీ(39) ఆచితూచి ఆడాడు. అయితే సౌథీ బౌలింగ్‌లో రిటర్న్‌ క్యాచ్ ఇచ్చి ధోనీ(39) ఔటయ్యాడు. ఆ తరువాత జాదవ్ కూడా ఔటవడంతో టీమిండియా మరింత కష్టాల్లో పడి్ంది. ఆ తరువాత వచ్చిన ఆక్సర్ పటేల్(17) ఔటవడంతో…. హార్థిక్ పాండ్య, ఉమేష్‌ యాదవ్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఉమేష్‌ సింగిల్స్‌ తీయగా.. పాండ్యా డబుల్స్‌ తీస్తూ స్కోరు బోర్డును పరుగెత్తించారు. అందివచ్చిన ఏ అవకాశాన్ని వదలకుండా వికెట్ల మధ్య అద్బుతంగా పరుగులు రాబట్టారు వీరిద్దరూ. 49వ ఓవర్లో బౌల్ట్‌ బౌలింగ్‌లో ఫోర్ కొట్టిన పాండ్యా(36) ఆ తరువాతి బంతిని సిక్స్ కొట్టబోయి తొమ్మిదో వికెట్‌గా ఔటయ్యాడు. చివరి ఓవర్లో సౌధీ బౌలింగ్ లో బుమ్రా క్లీన్ బౌల్డవడంతో ఇండియా 236 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కివీస్ కెప్టెన్‌ విలియంసన్‌కు మ్యాన్ ఆఫ్‌ ది మ్యాచ్ దక్కింది. బౌల్ట్‌..2 సోథీ..3 గప్తిల్‌ 2లకు వికెట్లు దక్కాయి.

అంతకుముందు టాస్ గెలిచిన టీమిండియా ముందుగా ఫీల్డింగ్‌కే మొగ్గు చూపింది. న్యూజీలాండ్ కెప్టెన్ విలియంసన్ అద్బుత సెంచరీ చేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీమ్ 50 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 242 ప‌రుగులు చేసింది. న్యూజిలాండ్ ఆట‌గాళ్ల‌లో గుప్తిల్‌-0, లాథ‌మ్‌-46, విలియ‌మ్ స‌న్‌-118, టైల‌ర్‌-21, అండ‌ర్స‌న్‌-21, రాంచీ-6, సాంటేర్‌(నాటౌట్‌) -9, డేవ్‌సిక్‌-7, సౌతీ-0, హెన్రీ-6, బౌల్ట్(నాటౌట్)-5 ప‌రుగులు చేశారు. టీమిండియా బౌల‌ర్ల‌లో ఉమేష్ 42 ప‌రుగులిచ్చి 1 వికెట్టు తీయ‌గా, ఆక్స‌ర్ 49 ప‌రుగులిచ్చి 1 వికెట్టు తీశాడు. జాధ‌వ్ 11 ప‌రుగులు ఇచ్చి 1 వికెట్టు తీశాడు. బ‌ూమ్రా 35 ప‌రుగులిచ్చి 3 వికెట్లు తీయ‌గా, మిశ్రా 60 ప‌రుగులు ఇచ్చి 3 వికెట్లు ప‌డ‌గొట్టాడు. 45 ప‌రుగులిచ్చిన పాండ్యాకి ఒక్క‌వికెట్టు కూడా ద‌క్క‌లేదు.

- Advertisement -