కష్టాల్లో న్యూజీలాండ్‌

246
- Advertisement -

ధర్మశాలలో జరుగుతున్న తొలి వన్డేతో వన్డేల్లో  అరంగేట్రం చేసిన భారత ఆటగాడు హార్దిక్ పాండ్యా ఆరంభంలోనే ఆకట్టుకున్నాడు. న్యూజిలాండ్ ఓపెనర్ గప్టిల్(12)ను ఇన్నింగ్స్ రెండో ఓవర్ లోనే పెవిలియన్ కు పంపి భారత్ కు మంచి శుభారంభాన్ని ఇచ్చాడు. ఉమేష్ యాదవ్ తో కలిసి కొత్త బంతి పంచుకున్న హార్డిక్ పాండ్య మూడు వికెట్ల తీసి ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కివీస్ టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది.  కేవలం 65 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది.

 

pandya

కివీస్ ఆటగాళ్లలో ఒక ఎండ్ లో నిలకడగా ఆడుతున్న ఓపెనర్ లాంతమ్ (36) ఒక్కడే బ్యాటింగ్ భారాన్ని మోస్తున్నాడు. మరోఓపెనర్ గుప్తిల్ (12) విఫలం కావడంతో న్యూజిలాండ్ పతనం ప్రారంభమైంది. టేలర్, రోంకీ, సాంటనర్ డక్ అవుట్ లు కావడం విశేషం. నసీమ్ షా (10), విలియమ్సన్ (3), ఆండర్సన్ (4) విఫలం కావడంతో, క్రీజులో లాంతమ్ కు జతగా బ్రాస్ వెల్ (5) ఉన్నాడు. దీంతో న్యూజిలాండ్ జట్టు 25 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. భారత బౌలర్లలో హార్డిక్ పాండ్య మూడు వికెట్లతో రాణించగా, ఉమేష్ యాదవ్, కేదార్ జాదవ్ చెరి రెండు వికెట్లు తీశారు.

- Advertisement -