కోహ్లీ సేనకు ఊహించని షాక్‌..!

212
- Advertisement -

మూడు వన్డేల సిరీస్‌లో కోహ్లీ సేనకు న్యూజిలాండ్‌ ఊహించని షాక్‌ ఇచ్చింది. వాంఖడే స్టేడియంలో ఆదివారం భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో 6 వికెట్ల తేడాతో కివీస్ జట్టు ఘన విజయం సాధించింది.

దీంతో 200వ వన్డేలో కోహ్లీ చేసిన రికార్డు సెంచరీ వృథా పోయింది..! భారత్‌ నిర్దేశించిన 281 పరుగుల లక్ష్యాన్ని.. న్యూజిలాండ్‌ నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి మరో ఆరు బంతులు మిగిలుండగానే ఛేదించింది.

 India vs New Zealand, 1st ODI: As It Happened...

‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ టామ్‌ లాథమ్‌ (102 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 103 నాటౌట్‌) అజేయ శతకానికి తోడు రాస్‌ టేలర్‌ (100 బంతుల్లో 8 ఫోర్లతో 95) సూపర్‌ హాఫ్‌ సెంచరీతో రాణించడంతో విజయం తేలికైంది. దీంతో మూ డు వన్డేల సిరీస్‌లో కివీస్‌ 1-0తో ముందంజ వేసింది. భారత బౌలర్లలో బుమ్రా, భువనేశ్వర్‌, హార్దిక్‌, కుల్దీప్‌ తలో వికెట్‌ పడగొట్టారు. అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 280 పరుగులు చేసింది.

కెప్టెన్‌ కోహ్లీ (125 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 121) సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. దినేష్‌ కార్తీక్‌ (37), ధోనీ (25) ఫర్వాలేదనిపించారు. చివర్లో భువనేశ్వర్‌ కుమార్‌ (26) ధాటిగా ఆడాడు. కివీస్‌ బౌలర్లలో ట్రెంట్‌ బౌల్ట్‌ నాలుగు, టిమ్‌ సౌథీ మూడు వికెట్లు పడగొట్టారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే పుణె వేదికగా బుధవారం జరగనుంది.

- Advertisement -